logo

ఒంటరి మహిళ జీవనం దయనీయం

అందరూ ఉండి పైసా పైసా కూడబెట్టి జీవనం సాగించాలంటేనే కష్టంగా మారింది. ఇలాంటిది తోడుగా ఉన్న భర్త మరణించాక.. పిల్లలూ లేని ఓ ఒంటరి మహిళ జీవనం దయనీయంగా ఉంది. మడకశిర పట్టణం మసీదు సమీప కాలనీకి చెందిన దేవకీ భర్త శ్రీనివాసులు(60) ఈ ఏడాది మే 15న అనారోగ్యంతో మరణించారు.

Published : 04 Oct 2022 02:35 IST

దేవకీ

న్యూస్‌టుడే, మడకశిర: అందరూ ఉండి పైసా పైసా కూడబెట్టి జీవనం సాగించాలంటేనే కష్టంగా మారింది. ఇలాంటిది తోడుగా ఉన్న భర్త మరణించాక.. పిల్లలూ లేని ఓ ఒంటరి మహిళ జీవనం దయనీయంగా ఉంది. మడకశిర పట్టణం మసీదు సమీప కాలనీకి చెందిన దేవకీ భర్త శ్రీనివాసులు(60) ఈ ఏడాది మే 15న అనారోగ్యంతో మరణించారు. ఒంటరి మహిళ పింఛను మంజూరు కోసం భర్త మరణ ధ్రువపత్రం, ఆధార్‌, దరఖాస్తు పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఐదు నెలలుగా కార్యాలయాలు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఆమెకు ఎలాంటి ఆదాయ వనరులు లేవు. పిల్లలూ లేరు. ఒంటరి మహిళగా జీవనం సాగించడం చాలా కష్టంగా మారిందని ఆమె కంట తడి పెట్టుకుంది. కనీసం గోలీమాత్రలు కొనుగోలు చేయడానికి తన వద్ద సొమ్ము లేదని, ప్రభుత్వం వెంటనే పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ మేనేజర్‌ నజీర్‌ను వివరణ కోరగా నగర పంచాయతీలో దరఖాస్తు చేసుకున్న పలువురి పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం నుంచి మంజూరు కాగానే పంపిణీ చేస్తామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని