logo

ఆసుపత్రికి వచ్చినా నరకమే..!

ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కంకరతేలిన రహదారిపై రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం బషీర్‌ అనేవ్యక్తిని చక్రాల కుర్చీపై కట్లు కట్టే గది వద్దకు తీసుకెళ్లేందుకు బంధువులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. శివానగర్‌కు చెందిన బషీˆర్‌ కాలికి గాయం కావడంతో ఆసుపత్రికి వచ్చారు.

Published : 04 Oct 2022 02:35 IST

కంకరతేలిన దారిపై చక్రాల కుర్చీలో బషీర్‌ను తీసుకెళుతున్న బంధువులు

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కంకరతేలిన రహదారిపై రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం బషీర్‌ అనేవ్యక్తిని చక్రాల కుర్చీపై కట్లు కట్టే గది వద్దకు తీసుకెళ్లేందుకు బంధువులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. శివానగర్‌కు చెందిన బషీˆర్‌ కాలికి గాయం కావడంతో ఆసుపత్రికి వచ్చారు. ప్రధాన గేటు వద్ద నుంచి అతడిని వీల్‌ఛైర్‌పై తీసుకెళ్లేందుకు సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దీంతో కుటుంబసభ్యులే తీసుకువెళ్లేందుకు పాట్లు పడ్డారు. వీల్‌ఛైర్‌ పాతది కావడం, కాలు పెట్టుకునేందుకు స్టాండు లేకపోవడం, రహదారి ఛిద్రమై కంకర తేలి ఉండటంతో వీల్‌ఛైర్‌ను ముందుకు తోయలేక ఇబ్బందుదెదురయ్యాయి. ఆసుపత్రి వద్ద ఉన్న ఓ యువకుడు గమనించి కట్లు కట్టే గది వరకు కుర్చీని తోసుకువెళ్లి సాయం చేశాడు. ఆసుపత్రి ఆవరణలో కంకరతేలిన రహదారిని మరమ్మతు చేయించాలని రోగులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని