logo

5న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పుట్టపర్తి రాక

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం పుట్టపర్తికి రానున్నారు. సత్యసాయి ఆడిటోరియంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బుధవారం ఉదయం 11.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారు.

Published : 04 Oct 2022 02:35 IST

పుట్టపర్తి, న్యూస్‌టుడే: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం పుట్టపర్తికి రానున్నారు. సత్యసాయి ఆడిటోరియంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బుధవారం ఉదయం 11.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్‌ అతిథి గృహానికి చేరుకుంటారు. 11.30 గంటలకు సాయికుల్వంత్‌ మందిరంలోని మహాసమాధిని ప్రత్యేకంగా దర్శించుకుంటారు. 11.45 గంటలకు సత్యసాయి ఇండోర్‌ స్టేడియంలో సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌, శ్రీహరికోట సహకారంతో సత్యసాయి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొంటారు. 1.30 గంటలకు కార్యక్రమం ముగించుకొని, శాంతిభవన్‌ అతిథి గృహానికి చేరుకుంటారు. 2.30కు సత్యసాయి విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి వెళతారు. గవర్నర్‌ పర్యటనను పురస్కరించుకొని, ట్రస్టువర్గాలు, పోలీసు, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని