logo

మునగ.. లాభాలు ఘనంగా

మునగ సాగు ఆయనకు అద్వితీయ లాభాలు తెచ్చిపెడుతోంది. పదేళ్ల నష్టాలు అధిగమించి ఆదాయ బాటలో నడిపిస్తోంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తున్నారు. శింగనమల మండలం జూలకాల్వ గ్రామానికి చెందిన సుధీర్‌నాయుడు పదో తరగతి వరకు చదివారు.

Published : 04 Oct 2022 02:35 IST

విరగ్గాసిన మునగకాయలు

శింగనమల, న్యూస్‌టుడే: మునగ సాగు ఆయనకు అద్వితీయ లాభాలు తెచ్చిపెడుతోంది. పదేళ్ల నష్టాలు అధిగమించి ఆదాయ బాటలో నడిపిస్తోంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తున్నారు. శింగనమల మండలం జూలకాల్వ గ్రామానికి చెందిన సుధీర్‌నాయుడు పదో తరగతి వరకు చదివారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై మక్కువ. తనకున్న నాలుగెకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేసి నష్టాలు చవిచూశారు. ఈ క్రమంలో తనకు తెలిసిన ఉపాధ్యాయుడిని కలిశారు. తన కష్టాలు చెప్పుకొన్నారు. మునగ సాగు బాగుంటుందని, చెన్నై సమీపంలో అలిగిరిస్వామి రకం మొక్కలు లభిస్తాయని ఆయన సూచించారు. ఆ మేరకు రైతు వాటిని తీసుకొచ్చారు. పశువుల ఎరువు వేయడంతో ఏపుగా పెరిగాయి.

నాలుగెకరాల్లో...
మూడేళ్ల కిందట నాలుగెకరాల్లో నాటారు. ఎకరాకు రూ.50వేలు చొప్పున రూ.2లక్షలు పెట్టుబడి పెట్టారు. మొదటి సంవత్సరం రూ.50 వేలు వచ్చింది. ఆ తర్వాత కాయలు విరగ్గాశాయి. రూ.5 లక్షలు అందుకున్నారు. ఈ ఏడాది రూ.50 వేలు ఖర్చు చేయగా రూ.10 లక్షలు వచ్చింది. కాయలు కాసిన తర్వాత మొక్కను కత్తిరిస్తే 40 నుంచి 50 రోజుల్లో తిరిగి కాస్తాయి. ఏడాది పొడవునా కాయలు ఉంటాయి. మంచిధర లభించిన సమయంలో కాయలు ఉంటే ఆదాయం అందుకోవచ్చు.


ఏపుగా పెంచితే...
- సుధీర్‌నాయుడు, రైతు

రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించాల్సిన అవసరం తక్కువ. ఏపుగా పెంచితే కాయలు విరగ్గాస్తాయి. ఈ రకం మొక్కకు వర్షం తక్కువ ఉంటే మంచిపంట వస్తుంది. ఏడాది పొడవునా కాయలు ఉంటాయి. ఏదో ఒక సమయంలో చక్కటి ధర వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని