logo

గొర్రెల్లో రోగాలు.. నివారణ

గొర్రెలకు మూతిపుండ్లు, జ్వరాలు సోకడంతో పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. వైద్యానికి వేలాది రూపాయలు ఖర్చుపెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మడకశిర ప్రాంతీయ పశువైద్యశాల పరిధిలోని మడకశిర, రొళ్ల, అగళి మండలాల్లో 2 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయి.

Published : 04 Oct 2022 02:35 IST

కాలిగిట్టల్లో గాయాలై కుంటుతున్న గొర్రె

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: గొర్రెలకు మూతిపుండ్లు, జ్వరాలు సోకడంతో పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. వైద్యానికి వేలాది రూపాయలు ఖర్చుపెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మడకశిర ప్రాంతీయ పశువైద్యశాల పరిధిలోని మడకశిర, రొళ్ల, అగళి మండలాల్లో 2 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయి. తనకు వంద గొర్రెలున్నాయని, అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్నాయని, మేత తినడంలేదని కదిరేపల్లికి చెందిన కాపరి అరళి తెలిపారు. రోగాలతో గొర్రెలు పిల్లలకు పాలివ్వడంలేదని ఉగ్రేపల్లికి చెందిన దొడ్డయ్య పేర్కొన్నారు.

సూదిమందుతో..
టెరామిజన్‌ సూదిమందు(3 మి.లీ.), మెలోనెక్స్‌ సూదిమందు(2మి.లీ.) వారం రోజులు వాడాలని ఏరియా పశువైద్యాధికారి అమర్‌ తెలిపారు. మూతిపుండ్లు సోకినచోట బోరిక్‌పౌడర్‌ పూయాలని సూచించారు. జీవాలకు రోగాలు సోకితే తక్షణమే 1962 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని,  అన్ని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని