logo

ఘనంగా ఆయుధపూజ

అనంతపురం జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఎస్పీ ఫక్కీరప్ప ప్రత్యేక పూజలు చేశారు.

Published : 05 Oct 2022 01:56 IST

పూజలో పాల్గొన్న ఎస్పీ ఫక్కీరప్ప

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఎస్పీ ఫక్కీరప్ప ప్రత్యేక పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం పోలీసు ఆయుధాగారంలోని వివిధ రకాల వాహనాలకు పూజలు నిర్వహించారు. సెంట్రల్‌ పోలీస్‌ క్యాంటీన్‌, తదితర చోట్ల పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. దుర్గామాత ఆశీస్సులతో జిల్లా ప్రజలు సంతోషంగా జీవించాలని, పోలీసులకు దైనందిన విధులు, సేవల్లో విజయాలు చేకూరాలన్నారు. అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, హనుమంతు, ఆర్‌ఐ హరికృష్ణ, లీగల్‌ అడ్వైజర్‌ విష్ణువర్దన్‌రెడ్డి, కమిటీ సభ్యులు త్రిలోక్‌నాథ్‌, సుధాకర్‌రెడ్డి, తేజ్‌పాల్‌, ఆర్‌ఎస్సైలు రాజశేఖర్‌రెడ్డి, రమేష్‌నాయక్‌, ప్రదీప్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని