logo

కోల్‌కతా బయలుదేరిన ఆంధ్ర క్రికెట్‌ జట్టు

బీసీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 14వరకు కోల్‌కతాలో జరగనున్న వినూమన్కడ్‌ అండర్‌-19 వన్‌డే క్రికెట్‌ పోటీలకు ఎంపికైన జట్టుకు నిర్వహించిన శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది.

Published : 05 Oct 2022 01:56 IST

అండర్‌-19 జట్టు ఇదే

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: బీసీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 14వరకు కోల్‌కతాలో జరగనున్న వినూమన్కడ్‌ అండర్‌-19 వన్‌డే క్రికెట్‌ పోటీలకు ఎంపికైన జట్టుకు నిర్వహించిన శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. వారం రోజులపాటు అనంత క్రీడాగ్రామంలో జరిగిన ఈ శిబిరంలో ఆటగాళ్లకు అనేక అంశాలపై తర్ఫీదు ఇచ్చారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య శిక్షకుడు ఎం.నిర్మల్‌కుమార్‌ హాజరై క్రీడాకారులకు సలహాలిచ్చారు. అంతర్రాష్ట్ర పోటీల్లో విజయభేరి మోగించి సగర్వంగా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి మధుసూదన్‌ మాట్లాడుతూ ఆంధ్ర జట్టును అగ్రస్థానంలో నిలపాలంటే ప్రతి క్రీడాకారుడు సమన్వయం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఆడాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షకులు రాధకృష్ణ, ఇంతియాజ్‌, అశోక్‌, ఆనందకుమార్‌, నవాజ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

జట్టు వివరాలు...: రాహుల్‌ (కెప్టెన్‌), రేవంత్‌రెడ్డి (వైస్‌కెప్టెన్‌), దత్తారెడ్డి, మల్లికార్జున, దీపక్‌, తేజ, యువాన్‌, అర్జున్‌ తెందూల్కర్‌, వరుణ్‌సాత్విక్‌, యశ్వంత్‌, అచ్యుత్‌ హేమంత్‌, చంటి, సాయి, రెడ్డిప్రకాశ్‌, సుజన్‌, సాయిసుమిత్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు