logo

ఆర్డీటీ అకాడమీ జట్టు ఘనవిజయం

అనంత క్రీడాగ్రామంలో జరిగిన రెండో వన్‌డేలో ఆర్డీటీ అకాడమీ జట్టు న్యూజిలాండ్‌ జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మంగళవారం ఉదయం టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ జట్టు కేవలం 44.1 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది.

Published : 05 Oct 2022 01:56 IST

లోహిత్‌సాయి (7 వికెట్లు)

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: అనంత క్రీడాగ్రామంలో జరిగిన రెండో వన్‌డేలో ఆర్డీటీ అకాడమీ జట్టు న్యూజిలాండ్‌ జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మంగళవారం ఉదయం టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ జట్టు కేవలం 44.1 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. విలియం డేవిడ్‌ గ్రీన్‌వుడ్‌ (31) మాత్రమే ప్రత్యర్థి బౌలర్ల ధాటిని ఎదుర్కొని పోరాడి పరువు నిలిపాడు. లోహిత్‌సాయి (7 వికెట్లు), లీలసాయి, కిరణ్‌కుమార్‌ చెరో ఒక వికెట్‌ కూల్చారు. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్డీటీ అకాడమీ జట్టు 20.1 ఓవర్లలో 4 వికెట్లకు 126 పరుగులు చేసింది. విఘ్నేష్‌కుమార్‌ (46) చక్కటి బ్యాటంగ్‌తో జట్టును గెలిపించాడు. ఒలియా టెవాటియా రెండు వికెట్లు కూల్చాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అకాడమీ జట్టు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని