logo

YSRCP: ‘హూఆర్‌యూ అనకుండా.. హౌఆర్‌యూ అంటే చాలు’

‘పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కలిసినప్పుడు హూఆర్‌యూ అనకుండా హౌఆర్‌యూ అంటే చాలు’ అని శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని కొందరు వైకాపా నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.

Updated : 06 Oct 2022 08:21 IST

వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేపై స్వపక్ష కార్యకర్తల అసంతృప్తి


మాట్లాడుతున్న వైకాపా పట్టణ అధ్యక్షుడు బహువుద్దీన్‌

కదిరి, న్యూస్‌టుడే: ‘పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కలిసినప్పుడు హూఆర్‌యూ అనకుండా హౌఆర్‌యూ అంటే చాలు’ అని శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని కొందరు వైకాపా నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. పార్టీ కదిరి పట్టణ అధ్యక్షుడు బహువుద్దీన్‌ ఆధ్వర్యంలో 1, 2, 36వ వార్డుకు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బహువుద్దీన్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు వారి గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలను గుర్తించే పరిస్థితిలో లేరని ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే సిద్ధారెడ్డిలను ఉద్దేశించి పేర్కొన్నారు. కష్టపడిన కార్యకర్తలను పక్కన పెట్టారని ఆరోపించారు. పార్టీ పట్ల ఇష్టమున్నా స్థానిక నాయకత్వ ప్రవర్తన ప్రభావం చూపుతోందన్న విషయం గమనించాలన్నారు. సలీం మాట్లాడుతూ తామేమీ కాంట్రాక్టు పనులు, పదవులు అడగలేదని, హూఆర్‌యూ అనకుండా హౌఆర్‌యూ అంటేచాలన్నారు. సమావేశంలో 14వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్‌ మహబూబ్‌బాషా, మాజీ కౌన్సిలర్‌ గంగాధర్‌, వైకాపా నాయకులు సురేష్‌రెడ్డి, హిదాయత్‌, గంగయ్య, సూర్యశేఖర్‌రెడ్డి, బషీర్‌, అంజి, జిలాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని