logo

అప్పులబాధతోనే ఆత్మహత్య

మండలంలోని మద్దనకుంటకు చెందిన యువ రైతు మంజునాథ్‌ (35) అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు. తన తండ్రి నుంచి వచ్చిన రెండెకరాల్లో రైతు రెండేళ్లుగా వేరుసెనగ, మిర్చి తదితర పంటలు సాగు చేశాడు.

Published : 05 Oct 2022 01:56 IST

మంజునాథ్‌ (పాతచిత్రం)

గుడిబండ, న్యూస్‌టుడే: మండలంలోని మద్దనకుంటకు చెందిన యువ రైతు మంజునాథ్‌ (35) అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు. తన తండ్రి నుంచి వచ్చిన రెండెకరాల్లో రైతు రెండేళ్లుగా వేరుసెనగ, మిర్చి తదితర పంటలు సాగు చేశాడు. గత ఏడాది పెట్టిన పెట్టుబడి సైతం దక్కలేదు. ఈసారి అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అప్పులు రూ.5 లక్షలు పైగా ఉండటంతో ఎలా తీర్చాలని మధనపడుతుండేవాడు. నలుగురు కుమార్తెలను ఎలా చదివించాలని ఆవేదన చెందుతుండేవాడు. ఈ బాధతో సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. మడకశిర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని