logo

Suicide: ఫేస్‌బుక్‌లో పరిచయం.. వేధిస్తున్నాడంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య

సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లచెరువుకు చెందిన యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచమై వేధిస్తున్నాడని..

Updated : 06 Oct 2022 07:27 IST

తనకల్లు : సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లచెరువుకు చెందిన యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచమై వేధిస్తున్నాడని.. తన చావుకు అతనే కారణమని యువతి సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఈ విషయం తెలిసి తన తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారని పేర్కొంది. అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని