logo

అంతరిక్ష విజ్ఞానం.. ప్రగతికి దోహదం

ప్రపంచ అంతరిక్ష విజ్ఞానం వ్యవసాయ, ఆరోగ్య, రక్షణ, సామాజిక రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు.

Published : 07 Oct 2022 04:42 IST

ప్రదర్శన తిలకిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ప్రపంచ అంతరిక్ష విజ్ఞానం వ్యవసాయ, ఆరోగ్య, రక్షణ, సామాజిక రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. బుధవారం సాయికుల్వంత్‌ మందిరంలో ఆయన సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ఇండోర్‌స్టేడియంలో ఇస్రో, సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌, సత్యసాయి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు జరిగే అంతరిక్ష వారోత్సవాలను ప్రారంభించారు. గవర్నర్‌తోపాటు ఇస్రో డైరెక్టర్‌ రాజరాజన్‌, కలెక్టర్‌ బసంత్‌కుమార్‌, సత్యసాయి మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌, ఛాన్సలర్‌ చక్రవర్తి, వైస్‌ ఛాన్సలర్‌ సంజీవి, ఎంపీ మాధవ్‌, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు. ఇస్రో సాధించిన ప్రగతిని తెరపై ప్రదర్శించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రపంచంలోని పలు దేశాల్లో శాస్త్రవేత్తలు ఆధ్యాత్మికతకు దూరంగా ఉంటారని, భారత్‌లో అందుకు భిన్నంగా సాంకేతికతతో ఆధ్యాత్మికత ముడిపడి ఉందన్నారు. భవిష్యత్తులో సత్యసాయి విశ్వవిద్యాలయంతో కలిసి సమాజానికి దోహదపడే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.

బహుమతి ప్రదానం చేస్తున్న ఇస్రో అధికారులు, డీఈవో మీనాక్షి


భావిశాస్త్రవేత్తలుగా ఎదగడమే లక్ష్యం

వారోత్సవాల్లో పాల్గొన్న విద్యార్థులు

పుట్టపర్తి గ్రామీణం: విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగాలన్నదే ప్రతిభా పరీక్షల ప్రధాన ఉద్దేశమని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. ఇస్రో ఆధ్వర్యంలో ఇటీవల అంతరిక్ష పరిశోధన, ఇతరత్రా అంశాలపై నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లా అంతటా 96 మంది విద్యార్థులకు బుధవారం సత్యసాయి ఇండోర్‌ స్టేయంలో బహుమతులు ప్రదానం చేశారు. ఇస్రో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు తిలకించడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. డీఈవో మీనాక్షి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని