logo

వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో రూ.4.72 కోట్లు వసూలు

కరోనాతో మూడేళ్లు కుదేలైన వ్యవసాయ మార్కెట్‌ యార్డులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ ఏడాది లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నాయి.

Published : 07 Oct 2022 04:42 IST

జిల్లా వ్యవసాయం: కరోనాతో మూడేళ్లు కుదేలైన వ్యవసాయ మార్కెట్‌ యార్డులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ ఏడాది లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిల్లాలోని తొమ్మిది వ్యవసాయ మార్కెట్‌ యార్డుల ఫీజుల వసూళ్ల లక్ష్యం రూ.10.43 కోట్లు కాగా.. ఆరు నెలలకు రూ.4,72,51,000 వసూలైయిందని, ఇప్పటికే 45.30 శాతం లక్ష్యాన్ని సాధించామని జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి సత్యనారాయణచౌదరి తెలిపారు. అనంత వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రథమ స్థానంలో ఉండగా.. రాప్తాడు రెండోస్థానంలో నిలిచింది. గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం వ్యవసాయ మార్కెట్‌ యార్డులు పూర్తిగా వెనుకపడ్డాయి. శింగనమల, తాడిపత్రి లక్ష్యానికి చేరువలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని