logo

జాతీయస్థాయిలో ధర్మవరం గాయనికి అవకాశం

తెలుగు జానపద సంగీతాన్ని దేశవ్యాప్తంగా వినిపించే అపూర్వ అవకాశం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన సోమిశెట్టి సరళ దక్కించుకున్నారు.

Published : 07 Oct 2022 04:42 IST

సోమిశెట్టి సరళ

ధర్మవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు జానపద సంగీతాన్ని దేశవ్యాప్తంగా వినిపించే అపూర్వ అవకాశం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన సోమిశెట్టి సరళ దక్కించుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 75 ఏళ్ల ఆజాదికా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ప్రసార భారతి విభాగంలోని ఆల్‌ఇండియా రేడియోశాఖ వారు దేశవ్యాప్తంగా పలు అంశాల్లో ‘ఏ’గ్రేడ్‌ కళాకారులైన 32 మందిని ఎంపిక చేశారు. వీరిలో సోమిశెట్టి సరళ ఒకరు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉభయ రాష్ట్రాల పరిధిలో ‘ఏ’ గ్రేడ్‌ కళాకారిణి అయిన సరళను జానపద సంగీతం అంశానికి ఎంపిక చేసి రికార్డింగ్‌కు ఆహ్వానించారు. ఆమె పాడిన జానపద పాటలను నవంబరు 3న రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రసారం చేయనున్నామని ప్రసార భారతి సంగీత కార్యక్రమం విభాగపు అసిస్టెంట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ సంతోష్‌ నహర్‌ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సరళ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని