logo

Super Star Krishna: సూపర్ స్టార్ పై అనంత అభిమానం

సూపర్‌స్టార్‌ కృష్ణ తమ కుటుంబానికి ఆపద్బాంధవుడని కృష్ణ సేన అభిమాన సంఘం అధ్యక్షుడు గౌరీశంకర్‌ తెలిపారు. తన కూతురు మంజుల కడుపులో కణతితో బాధ పడుతుండగా గతేడాది కృష్ణ ఆపరేషన్‌ చేయించినట్లు చెప్పారు.

Updated : 16 Nov 2022 09:29 IST

నంబులపూలకుంట వద్ద సినిమా షూటింగ్‌లో..

న్యూస్‌టుడే బృందం: సూపర్‌స్టార్‌ కృష్ణకు ఉమ్మడి అనంత జిల్లాతో అనుబంధం ఉంది. 1976లో అప్పటి నీలిమ టాకీసులో పాడిపంటలు చిత్ర ప్రదర్శన సమయంలో ఆయన అనంత నగరానికి వచ్చారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున అనంతపురం, హిందూపురం, కదిరి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు.

* 1980-90లో పలుమార్లు కృష్ణ ధర్మవరం వచ్చి వెళ్లారు. ఇక్కడి ఫైనాన్షియర్లు చిత్రనిర్మాణ సంస్థలకు ఫైనాన్స్‌ చేసేవారు. భారీ బడ్జెట్‌లో పలు చిత్రాలను కృష్ణ నిర్మించారు.
*  1997లో ఎన్‌.శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఎన్‌కౌంటర్‌ సినిమా షూటింగ్‌ నంబులపూలకుంట మండలం గూటిబైలు ఈశ్వర్‌మలై అడవుల్లో జరిగింది. ప్రపంచ ప్రసిద్ధిచెందిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద విడిది చేశారు.
* సూపర్‌ స్టార్‌ పుట్టిన రోజు వేడుకలను ఏటా ఊటీలో అభిమానుల మధ్య జరుపుకొనేవారు. ఆ వేడుకల్లో 32 ఏళ్లు పాల్గొన్నట్లు కృష్ణసేన అనంతపురం జిల్లా గౌరవాధ్యక్షుడు చుంచుల నగేష్‌ తెలిపారు.

45 ఏళ్ల కిందట గుంతకల్లులో పాడిపంటలు సినిమా అర్ధశతదినోత్సవంలో కృష్ణ, విజయనిర్మల

ఆ కుటుంబానికి ఆపద్బాంధవుడు

రాయదుర్గం: సూపర్‌స్టార్‌ కృష్ణ తమ కుటుంబానికి ఆపద్బాంధవుడని కృష్ణ సేన అభిమాన సంఘం అధ్యక్షుడు గౌరీశంకర్‌ తెలిపారు. తన కూతురు మంజుల కడుపులో కణతితో బాధ పడుతుండగా గతేడాది కృష్ణ ఆపరేషన్‌ చేయించినట్లు చెప్పారు. రెండో కూతురు సంధ్య పెళ్లికి ఆర్థిక సహాయం చేశారని, మరో కూతురు మధుమేహ వ్యాధితో బాధ పడుతుంటే అప్పట్లో చికిత్సలకు మందులు పంపేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు గుర్తుగా తన సంతానానికి కృష్ణ, మహేష్‌, మంజుల, సుధీర్‌బాబు పేర్లు పెట్టినట్లు గౌరీశంకర్‌ వివరించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని