logo

అదిరెను.. అనంత తోలుబొమ్మ

దిల్లీ ప్రగతి మైదానంలో జరుగుతున్న ‘ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ -2022’లో అనంతపురం తోలుబొమ్మలకు ఆదరణ లభిస్తోంది.

Published : 26 Nov 2022 04:37 IST

స్టాల్‌ వద్ద ఉత్పత్తులను విక్రయిస్తున్న పుష్పావతి

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: దిల్లీ ప్రగతి మైదానంలో జరుగుతున్న ‘ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ -2022’లో అనంతపురం తోలుబొమ్మలకు ఆదరణ లభిస్తోంది. ఇక్కడి ప్రదర్శనకు రాష్ట్రం నుంచి అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన నాలుగు రకాల ఉత్పత్తులు మాత్రమే ఎంపిక చేశారు. మహిళా సభ్యులు మాత్రమే తమ ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించొచ్చు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వయం సహాయక గ్రూపులకు అవకాశం ఇచ్చారు. ఇందులో అనంతపురం జిల్లాలో తయారు చేసిన తోలు బొమ్మలకు అవకాశం లభించింది. అనంతపురం వినాయక మహిళా సంఘం ద్వారా పుష్పావతి తయారు చేసిన తోలుబొమ్మల ఉత్పత్తులను దిల్లీలో ప్రదర్శిస్తున్నారు. ఈమె పదేళ్లుగా బొమ్మల తయారీకి శ్రీకారం చుట్టారు. ఆకట్టుకొనే గృహోపకరణాలు చేయడంలో ప్రావీణ్యం పొందారు. షోలాపూర్‌ నుంచి లెదర్‌ కొనుగోలు చేసి వాటికి ఆకట్టుకొనే రంగులు అద్దుతారు. లైట్లు, హ్యాండ్‌ వాల్స్‌, వాల్‌ ప్రేమ్స్‌, గోడలకు ల్యాంప్స్‌, దేవతలు, పక్షులు ఇలా ఎన్నో రకాల కళాకృతులను దిల్లీలో జరిగే ప్రదర్శనలో ఉంచారు. ఈనెల 27వ తేదీ వరకు ప్రదర్శన జరగనుంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని