logo

అగ్గిపెట్టె ఇవ్వలేదని హత్య

బీడీ వెలిగించుకునేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదని వృద్ధుడ్ని ఓ వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్వీయూ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను తిరుపతి పడమర డీఎస్పీ నరసప్ప వెల్లడించారు.

Updated : 26 Nov 2022 05:12 IST

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: బీడీ వెలిగించుకునేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదని వృద్ధుడ్ని ఓ వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్వీయూ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను తిరుపతి పడమర డీఎస్పీ నరసప్ప వెల్లడించారు. ‘ఈ నెల 15న రాత్రి మహిళా వర్సిటీ బస్‌షెల్టర్‌లో గుర్తుతెలియని వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఆధారాల ప్రకారం విజయవాడకు చెందిన రేపాకుల లక్ష్మణరావు(70)గా గుర్తించారు. భార్య పిల్లలను వదిలేసి తిరుపతిలో భిక్షాటన చేస్తూ ఊరికి వెళ్లి వస్తుంటాడు. గుంతకల్లుకు చెందిన పాత నేరస్థుడు ఎ.మణిరత్నం అలియాస్‌ ఆర్ముగం తిరుపతిలో చిత్తు కాగితాలు సేకరించి అమ్ముకుంటూ తిరుగుతుంటాడు. ఈ నెల 15వ తేదీ లక్ష్మణరావు బస్టాండులో నిద్రిస్తుండగా.. మణిరత్నం అతని దగ్గరకు వెళ్లి అగ్గిపెట్టె అడగ్గా.. బూతులు తిట్టి కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. కక్ష పెంచుకున్న మణిరత్నం అక్కడున్న బండ రాయి తీసుకుని లక్ష్మణరావు తలపై కొట్టి హతమార్చాడు. సీసీ కెమెరాలకు ఆధారాలు దొరకకూడదని రక్తపు మరకలు ఉన్న డ్రస్‌ మార్చుకొని దాన్ని కాల్చి పరారయ్యాడు. రహస్య సమాచారం మేరకు ఈ నెల 24న రైల్వేస్టేషన్‌ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై 2017లో మసీదులో హత్య చేసి ఆధారాలు చెరిపేసిన కేసు నమోదైంది. అతనిపై పలు హత్యలు, దొంగతనాల కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు