చరవాణి బుక్ చేస్తే.. షాంపు వచ్చింది
ఈ కామర్స్ వెబ్‌సైట్లలో అనేక మోసాలు జరుగుతున్నాయి. వినియోగదారులు ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరొకటి అందుతోంది.
షాంపు బాటిల్‌ను చూపుతున్న బాధితుడు మస్తాన్ వలి
అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఈ కామర్స్ వెబ్‌సైట్లలో అనేక మోసాలు జరుగుతున్నాయి. వినియోగదారులు ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరొకటి అందుతోంది. ఇప్పటికే పలు మోసాలు జరగగా, తాజాగా ఈ కామర్స్ సర్వీస్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మరో మోసం వెలుగు చూసింది. అనంతపురం నగరంలోని పాతూరు భాగ్యనగర్‌కు చెందిన మస్తాన్‌వలి ఈ నెల 14న ఫ్లిప్‌కార్ట్‌లో రూ.34 వేలు విలువ చేసే ఐక్యూ ఫోన్ బుక్ చేశారు. ఈ నెల 17న డెలివరీ బాయ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి వచ్చిన బాక్సును ఇచ్చి వెళ్లాడు. బాక్సు బరువుగా ఉండటంతో బాధితునికి సందేహం వచ్చి వీడియో తీస్తూ తెరిచారు. చరవాణికి బదులు హెడ్ అండ్ షోల్డర్ షాంపు ఉండటంతో కంగుతిన్నారు. వెంటనే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. డెలివరీ చేసిన స్టోర్ మేనేజర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్టోర్ మేనేజర్‌ను ఆరా తీయగా రెండు మూడు రోజుల్లో బాధితుడికి డబ్బులు రీఫండ్ అవుతాయని తెలిపారు. ఇటీవల నగరానికి చెందిన ఓ యువకుడు రూ.2 వేలు విలువ చేసే స్మార్ట్‌వాచ్ బుక్ చేయగా, రూ.500 విలువ చేసే సాధారణ వాచీ డెలివరీ చేసినట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!