logo

అయ్యో..పాపం!

ఆ కుటుంబాన్ని విధి వెంటాడుతోంది. రెండేళ్ల లోపే ఇంటి పెద్దతో పాటు కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోయారు.

Published : 26 Nov 2022 04:37 IST

 నాడు కరోనాతో తండ్రి..
నేడు ప్రమాదంలో కుమారుడు మృతి
ఆసుపత్రిలో తల్లి

సాయిచరణ్‌ (పాతచిత్రం)

హిందూపురం పట్టణం, చిలమత్తూరు, న్యూస్‌టుడే: ఆ కుటుంబాన్ని విధి వెంటాడుతోంది. రెండేళ్ల లోపే ఇంటి పెద్దతో పాటు కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. మరోవైపు తల్లి చావుబతుకుల మధ్య చికిత్స పొందుతోంది. ఆ కుటుంబం పరిస్థితి చూసి పట్టణంలోని మోడల్‌కాలనీలో ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం... చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని మోడల్‌కాలనీకి చెందిన సాయిచరణ్‌(19) మృతి చెందగా అతని తల్లి నాగజ్యోతి(40) చావు బతుకుల మధ్య బెంగళూరులో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబపోషణకు వారు వ్యాపారం చేసేవారు. వారికి అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, వక్కపొడిని దుకాణాలకు సరఫరా చేసే ఏజెన్సీ ఉంది. ఏడాదిన్నర కిందట కుటుంబం పెద్ద నటేష్‌కుమార్‌(45) కరోనాతో మరణించారు. దీంతో వ్యాపార బాధ్యతలు కుమారుడిపై పడ్డాయి. డిగ్రీ చదవుతున్న సాయిచరణ్‌ తల్లితో కలిసి సరకులను నియోజకవర్గంలోని దుకాణాలకు ద్విచక్రవాహనంలో సరఫరా చేస్తున్నాడు. ఇందులో భాగంగా శుక్రవారం చిలమత్తూరు, గోరంట్ల మండలాలకు వెళ్లారు. కొడూరుతోపులో జాతీయ రహదారి మీద తమ వాహనాన్ని గోరంట్ల వైపు మళ్లించగా.. అదే సమయంలో అనంతపురం వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో సాయి చరణ్‌కు తలకు గాయాలు కాగా నాగజ్యోతికి కాలు విరిగింది. క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తలకు గాయాలైన సాయిచరణ్‌ మృతి చెందాడు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో నాగజ్యోతిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఆరో తరగతి చదువుతున్న నాగజ్యోతి కూతురు అశ్వీత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని