logo

జారిపడితే.. చిత్రావతిలోకే..!

పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని కోవెలగుట్లపల్లి కాజ్‌వేపై మూడు నెలలుగా నీరు ప్రవహిస్తుండటంతో పాచిపట్టింది. దీనిపై ప్రజలు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు.

Published : 26 Nov 2022 04:37 IST

పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని కోవెలగుట్లపల్లి కాజ్‌వేపై మూడు నెలలుగా నీరు ప్రవహిస్తుండటంతో పాచిపట్టింది. దీనిపై ప్రజలు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. కోవెలగుట్లపల్లి నుంచి పుట్టపర్తికి గ్రామస్థులు, పాఠశాల విద్యార్థులు నిత్యం కాజ్‌వేపై వెళ్లాల్సిందే. ప్రమాదవశాత్తు జారితే చిత్రావతి నదిలోకి పడతారు. దీంతో ఒకరికొకరు తోడుగా చేరుకుంటున్నారు. వృద్ధులు, పిల్లలు భయం.. భయంగా దాటుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాజ్‌వేపై పాచి తొలగించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కాజ్‌వేపై ఉన్న పాచిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని నగర పంచాయతీ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు.
- న్యూస్‌టుడే, పుట్టపర్తి

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు