‘జగన్ మామయ్యా.. పుస్తకాలు ఇవ్వయ్యా’
విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తోంది. ఇంతవరకు ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలే ఇవ్వలేదు.
ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు
అనంతపురం (రాణినగర్), న్యూస్‌టుడే: విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తోంది. ఇంతవరకు ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలే ఇవ్వలేదు. ఏం చదవాలి.. పరీక్షలెలా రాయాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులతో కలిసి విద్యార్థులు అనంతపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. జగన్ మామయ్యా.. పుస్తకాలు ఇవ్వయ్యా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెలుగునాడు విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి పరశురాం, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనరసింహ, పార్లమెంటు అధ్యక్షుడు ధనుంజయనాయుడు తదితరులు మాట్లాడుతూ ఉమ్మడి అనంత జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారని, ఇప్పటిదాకా పుస్తకాలు సరఫరా చేయలేదన్నారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. వైకాపా ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: బామ్మర్ది ఎంత పనిచేశావ్.. డబ్బు కోసం ఇంత బరితెగింపా?
-
Movies News
Raveena Tandon: అక్షయ్‌తో బ్రేకప్.. దాదాపు పాతికేళ్ల తర్వాత పెదవి విప్పిన నటి
-
Politics News
Lok Sabha: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకండి : ఉత్తమ్‌కు స్పీకర్ సూచన
-
Sports News
Team India Final XI: గిల్ ఉంటాడా.. సూర్య వస్తాడా.. కీపర్ ఎవరు.. స్పిన్నర్ లెక్కేంటి?
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Modi: ఆ దశాబ్ద కాలాన్ని మనం కోల్పోయాం.. విపక్షాలపై మోదీ ఫైర్