logo

తెలుగు రాష్ట్రాలకు త్వరలో వందేభారత్‌ రైలు

రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని దక్షిణ మధ్య రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌జైన్‌ పేర్కొన్నారు.

Published : 30 Nov 2022 05:52 IST

తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో పర్యటిస్తున్న జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌, రైల్వే అధికారులు

తాడిపత్రి, న్యూస్‌టుడే: రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని దక్షిణ మధ్య రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌జైన్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తాడిపత్రిలోని రైల్వేస్టేషన్‌, క్వార్టర్స్‌, టిక్కెట్టు ఇచ్చే కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మెయింటెనెన్స్‌ హ్యాండ్‌బుక్‌ ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా తాడిపత్రి స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న తిరుపతి, నెల్లూరు రైల్వేస్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. మరో 15 స్టేషన్లను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వందేభారత్‌ రైలు కేబినెట్‌ ఆమోదం పొందిన వెంటనే పట్టాలు ఎక్కుతుందని చెప్పారు. ఆయన వెంట గుంతకల్లు డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి, సేప్టీ డీఆర్‌ఎం మురళీధర్‌ శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు.

రైల్వే బైపాస్‌లైన్‌ ప్రారంభం

గుత్తి: కొత్తగా రూ.30 కోట్లతో గుత్తిలో నిర్మించిన బైపాస్‌ రైలు మార్గాన్ని మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌జైన్‌ ప్రారంభింంచారు. గూడ్సు రైళ్లను నేరుగా పంపించేందుకు వీలుగా గుత్తి- రేణిగుంట, ధర్మవరం- ముంబయి మార్గాలను అనుసంధానం చేసి బైసాస్‌ లైన్‌ను నిర్మించారు. దీన్ని జీఎం ప్రారంభించారు. దీంతోపాటు గేట్‌మెన్‌ గదిలో సోలార్‌తో పనిచేసే నీటిశుద్ధి ప్లాంటును ప్రారంభించారు. బైపాస్‌ రైలు మార్గం సమీపంలో యార్డు, లైన్‌ మ్యాప్‌ను జీఎం చూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని