logo

కల నిజం చేసుకున్నాడు

ఆ యువకుడికి డ్యాన్స్‌ అంటే అమితాసక్తి. అందులో రాణించాలని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి సాధించాడు.

Published : 30 Nov 2022 05:52 IST

ట్రోఫీతో ఆసిఫ్‌

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: ఆ యువకుడికి డ్యాన్స్‌ అంటే అమితాసక్తి. అందులో రాణించాలని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి సాధించాడు. రాయదుర్గం వెంకటేశ్వరకాలనీకి చెందిన దాదాపీర్‌ ద్విచక్ర వాహనంలో మరమరాలు విక్రయిస్తుంటాడు. ఆయన భార్య ఉమేసల్మీ టైలరింగ్‌ చేస్తుంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు ఆసిఫ్‌ పదో తరగతి వరకు చదువుకున్నాడు. అప్పటివరకు చిన్నాన్న, పెదనాన్న అందరూ ఉమ్మడిగా ఉండేవారు. వారందరూ విడిపోవడంతోపాటు ఆర్థిక సమస్యలు ఎదురవడంతో ఆసిఫ్‌ దిక్కుతోచనిస్థితిలో పడిపోయాడు. సొంతకాళ్లపై నిలవాలని ఆలోచించాడు. మూడేళ్ల కిందట పట్టణానికి చెందిన జిత్తు, కృష్ణసాయంతో హైదరాబాద్‌ వెళ్లాడు. డ్యాన్స్‌పై ఆసక్తి పెంచుకుని నిత్యం సాధన చేసేవాడు. సుమారు మూడు నెలలు కొనసాగిన జెమిని డ్యాన్స్‌ ఐకాన్‌ పోటీల్లో పాల్గొని వివిధస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈనెల 27న గ్రాండ్‌ ఫైనల్‌లో విజేతగా నిలిచాడు. ట్రోఫీతో పాటు రూ.20 లక్షల పారితోషికం అందుకున్నాడు. డ్యాన్సర్‌గా తన కల సాకారమైందని, సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా రాణించాలన్నదే లక్ష్యమని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని