logo

రాష్ట్రస్థాయికి ఏడు ప్రాజెక్టుల ఎంపిక

కొత్తచెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ బాలల కాంగ్రెస్‌ సైన్సు ప్రదర్శనలో ఏడు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి, హెచ్‌ఎం చెన్నకృష్ణారెడ్డి తెలిపారు.

Published : 01 Dec 2022 05:47 IST

అధ్యాపకులకు వివరిస్తున్నవిద్యార్థులు

కొత్తచెరువు, న్యూస్‌టుడే: కొత్తచెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ బాలల కాంగ్రెస్‌ సైన్సు ప్రదర్శనలో ఏడు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి, హెచ్‌ఎం చెన్నకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని 98 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల నుంచి 224 మంది విద్యార్థులు, 98 మంది ఉపాధ్యాయులు రెండు రోజుల సైన్సు ప్రదర్శనకు హాజరయ్యారు. సత్యసాయి యూనివర్సిటీ అధ్యాపకులు ప్రదీప్‌, నరేష్‌, కొత్తచెరువు జూనియర్‌ కళాశాల అధ్యాపకులు చంద్రమౌళి, నాగరాజు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పి.ఎల్‌ స్వాతి, జడ్పీహెచ్‌ఎస్‌, ధనాపురం (పరిగి), ధీరజ్‌, యూకే ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల (గోరంట్ల), ఎం.సింధూ, సిద్ధార్థ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల (పెనుకొండ), ఎన్‌.అర్హన్‌, జడ్పీహెచ్‌ఎస్‌ (కదిరి), జి.చరణ్‌తేజ, జడ్పీహెచ్‌ఎస్‌ (సోమందేపల్లి), సి.కళ్యాణి, జడ్పీహెచ్‌ఎస్‌ ఉప్పలపాడు, (ముదిగుబ్బ), ఎస్‌.హేమలత, జడ్పీహెచ్‌ఎస్‌, గూటిబయలు (ఎన్పీకుంట)కు చెందిన విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను న్యాయనిర్ణేతలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. 9, 10, 11 తేదీల్లో నెల్లూరు జిల్లా గూడూరులో జరిగే రాష్ట్రస్థాయి ప్రదర్శన పోటీల్లో జిల్లా నుంచి ఎంపికైన ఏడు మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్సు అధికారి ఆనంద్‌ భాస్కర్‌ రెడ్డి, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, డైట్‌ అధ్యాపకులు గోవిందరాజులు, అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని