logo

‘జాకీతోనే మహిళల ఉపాధి పోయింది’

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆయన సోదరుల బెదిరింపులతో జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

Published : 01 Dec 2022 06:09 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత

అనంతపురం (రాణినగర్‌), కళ్యాణదుర్గం రోడ్డు, న్యూస్‌టుడే: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆయన సోదరుల బెదిరింపులతో జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలోని ఆమె నివాసంలో రాప్తాడు నియోజకవర్గ నాయకులతో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి శ్రేణులను సన్నద్ధం చేయడానికి సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. 2వ తేదీ నుంచి రామగిరి మండలం శ్రీహరిపురం కాలనీ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. జాకీ పరిశ్రమ నెలకొల్పి ఉంటే ప్రత్యక్షంగా 6వేల మంది మహిళలకు ఉపాధి లభించేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా పాలనకు చరమగీతం పాడితేనే రాష్ట్రానికి పట్టిన ఖర్మ పోతుందన్నారు. ఈ సందర్భంగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే బాధ్యులకు ప్రచార కిట్లు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు