logo

విద్యతో ఉజ్వల భవిత

విద్యతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ తెలిపారు. బుధవారం అనంతపురంలోని కేఎస్‌ఎన్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జగనన్న విద్యాదీవెన కింద జిల్లాలోని 48,976 మంది విద్యార్థులకు సంబంధించి 43,965 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.28.43 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

Published : 01 Dec 2022 06:09 IST

నమూనా చెక్కును విద్యార్థులకు అందజేస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, మేయర్‌ వసీం,

ఉపమేయర్‌ వాసంతి, సాధికారత అధికారి విశ్వమోహన్‌రెడ్డి

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: విద్యతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ తెలిపారు. బుధవారం అనంతపురంలోని కేఎస్‌ఎన్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జగనన్న విద్యాదీవెన కింద జిల్లాలోని 48,976 మంది విద్యార్థులకు సంబంధించి 43,965 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.28.43 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆమె విద్య ఆవశ్యకత గురించి చెప్పారు. నగర మేయర్‌ వసీం మాట్లాడుతూ పేద విద్యార్థులు ఎవరూ ఉన్నత చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బృహత్తరమైన పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో ఉపమేయర్లు వాసంతి సాహిత్య, విజయభాస్కర్‌రెడ్డి, ఆర్టీసీ రీజియన్‌ ఛైర్‌పర్సన్‌ మంజుల, నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌ హరిత, ఏడీసీసీ బ్యాంకు ఛైర్‌పర్సన్‌ లిఖిత, సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్‌ రామలక్ష్మి, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి విశ్వమోహన్‌రెడ్డి, కళాశాల ప్రధానాచార్యులు లక్ష్మీరంగయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని