logo

పింఛన్‌ పంపిణీలో మహిళా వాలంటీరు చేతివాటం

అభ్యాగులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం నెలనెలా పంపిణీ చేస్తున్న పింఛన్‌ వారికి కొంత ఆసరాగా ఉంటోంది.

Published : 02 Dec 2022 06:08 IST

40 మంది లబ్ధిదారులతో రూ.వంద చొప్పున వసూలు

తాడిమర్రి, న్యూస్‌టుడే: అభ్యాగులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం నెలనెలా పంపిణీ చేస్తున్న పింఛన్‌ వారికి కొంత ఆసరాగా ఉంటోంది. వచ్చిన సొమ్ములోనే రోజూ కొంత చొప్పున ఖర్చు చేస్తూ నెలంతా నెట్టుకొస్తున్నారు. అలాంటి వారి నుంచీ ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా ఓ మహిళా వాలంటీరు చేతివాటం ప్రదర్శించింది. ఇదేమని అడిగితే మీకు పింఛన్‌ పంపిణీ చేయడం వల్ల తాను నష్టపోతున్నానని, దానిని పూడ్చుకునేందుకే రూ.వంద తీసుకుంటున్నానని వాలంటీరు తెలిపిందని లబ్ధిదారులు తెలిపారు. వివరాలు.. తాడిమర్రి మండల పరిధిలోని నార్శింపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళా వాలంటీరు గురువారం తన పరిధిలోని 40 మందికి పింఛన్లు పంపిణీ చేసింది. వారికి రూ.100 తక్కువగా ఇచ్చింది. దీనిపై లబ్ధిదారులు సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మోహన్‌ను వివరణ కోరగా సదరు వాలంటీరును పిలిపించి నగదు వెనక్కి ఇచ్చేయాలని చెప్పానని తెలిపారు. కాగా.. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ చెప్పినా వాలంటీరు నగదు వాపస్‌ ఇవ్వలేదని లబ్ధిదారులు తెలిపారు. గతంలోనూ చేనేత నేస్తం సొమ్ము పంపిణీలో చేతివాటం ప్రదర్శించిందని ఆరోపించారు. దివ్యాంగులు, వితంతవులు అనే కనికరం లేకుండా నగదు వసూలు చేసిన వాలంటీరు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని