logo

ధరలేక.. నోటమాటలేక

అప్పులు చేసి సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చేతికందిన పంటను సైతం పొలాల్లోనే వదిలేస్తున్నారు.

Published : 02 Dec 2022 06:08 IST

ఆకులవారిపల్లిలో తోటలోనే వదిలేసిన టమోటా

అప్పులు చేసి సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చేతికందిన పంటను సైతం పొలాల్లోనే వదిలేస్తున్నారు. అమడగూరు మండలంలోని ఆకులవారిపల్లి, ఈడిగివారిపల్లి, పుట్లవాండ్లపల్లి, గాజులపల్లి తదితర గ్రామాల రైతులు టమోటా సాగు చేశారు. పంట అధిక దిగుబడి వచ్చినప్పటికీ మార్కెట్లో ధర లేకపోవడంతో పొలాల్లోనే వదిలేశారు. పంటను తొలగించడానికి అవసరమైన కూలీలు, రవాణా ఖర్చులకు కూడా డబ్బులు రాకపోవడంతో పంటను వదిలేసినట్లు రైతులు మల్లికార్జునరెడ్డి, సుబ్బరాయుడు, నారాయణరెడ్డి, శ్రీనివాసులు, సంజీవ తదితరులు వాపోయారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.

న్యూస్‌టుడే, అమడగూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని