logo

ఇసుక సరఫరా చేయక పొట్టకొడుతున్న ప్రభుత్వం

ప్రభుత్వం ఇసుకను వ్యాపారం చేస్తూ.. సామాన్య ప్రజలు ఇల్లు నిర్మించుకునే అవకాశం లేకుండా..

Updated : 02 Dec 2022 07:44 IST

భవన నిర్మాణ కార్మికుల అర్ధనగ్న నిరసన

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఇసుకను వ్యాపారం చేస్తూ.. సామాన్య ప్రజలు ఇల్లు నిర్మించుకునే అవకాశం లేకుండా.. భవన కార్మికులకు ఉపాధి అవకాశాలు లేకుండా కడుపుకొడుతోందని జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదిర్శి సాంబశివ ఆరోపించారు. గురువారం ఆర్టీసీ డిపో వద్ద నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో భవన కార్మికులు కలెక్టరేట్‌ వరకు అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించారు. ఇసుక మాఫియాను అరికట్టి, గతంలో మాదిరిగా ఉచితంగా అందించి కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండు చేశారు. కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును నుంచి ప్రభుత్వం వివిధ పథకాలకు రూ.1,280 కోట్లు వాడుకొందని మండిపడ్డారు. వెంటనే జమ చేసి, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను పరిష్కరించాలని కోరారు. కలెక్టర్‌ బసంత్‌కుమార్‌కు కార్మికులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, సీఐటీయూ కార్యదర్శి గౌస్‌లాజం, కోశాధికారి రామకృష్ణ, నాయకులు వెంకటేష్‌, సుధాకర్‌, రవినాయక్‌, మునాఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని