logo

పప్పులో ఎలుక!

అనంతపురం కమలానగర్‌లోని ఓ హోటల్‌లో కొన్న పప్పులో ఎలుక వచ్చిన ఘటన నగరంలో కలకలం రేపింది.

Updated : 03 Dec 2022 12:52 IST

కమలానగర్‌, న్యూస్‌టుడే: అనంతపురం కమలానగర్‌లోని ఓ హోటల్‌లో కొన్న పప్పులో ఎలుక వచ్చిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఆ హోటల్‌కు కొంతదూరంలో నివాసం ఉంటున్న జయకృష్ణ సదరు హోటల్‌లో రూ.30 పప్పు, రూ.20 చట్నీ కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి భోజనం చేసేందుకు అన్నంలో పప్పు వేసుకున్నారు. అందులో చచ్చిన ఎలుక కనిపించింది. కంగుతిని, ఆగ్రహంతో హోటల్‌ వద్దకు అన్నం ప్లేటు తీసుకెళ్లి నిర్వాహకులకు చూపించి వాదనకు దిగారు. తమ వద్ద పప్పు కొనలేదని వారు చెప్పడంతో రూ.50 ఫోన్‌ పే చేసినట్లు బాధితుడు చూయించారు. నిర్వాహకులు ప్లేటు తీసుకుని అన్నం, పప్పు పారేశారు. నాణ్యతా, శుభ్రత పాటించని హోటళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని