అప్పుల బాధతో వృద్ధుడి ఆత్మహత్య

మండలంలోని నార్శింపల్లికి చెందిన కుంచపు ఆంజనేయులు (64) అనే వృద్ధుడు అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated : 03 Dec 2022 05:25 IST

ఆంజనేయులు (దాచిన చిత్రం)

నార్శింపల్లి (తాడిమర్రి), న్యూస్‌టుడే : మండలంలోని నార్శింపల్లికి చెందిన కుంచపు ఆంజనేయులు (64) అనే వృద్ధుడు అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. ఆంజనేయులు గ్రామంలో చీటీలు నిర్వహిస్తుండేవాడు. కొందరు చీటీ సభ్యులు నగదు ఎత్తుకుని నెలనెలా కంతులు సరిగా కట్టడం లేదు. చీటీల కాల పరిమితి ముగిసిన వారు పూర్తి నగదు ఇవ్వాలని ఆంజనేయులుపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. దీని కోసం అందినకాడికి ఆయన అప్పులు చేశారు. గత కొన్ని రోజులుగా అప్పులు తీర్చాలని రుణదాతలు ఒత్తిడి చేస్తుండేవారు. దీంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం భార్య రమాదేవి, కొడుకు రవికుమార్‌ గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఆంజనేయులు వ్యవసాయం కోసం కూడా అప్పులు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరాతీశారు. ఆంజనేయులు కుమారుడు రవికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆయనకు భార్య రమాదేవి, కుమారులు రవికుమార్‌, ధనుంజయ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని