logo

ఔషధ పరిశ్రమల స్థాపనకు యువత నడుం బిగించాలి

నాలుగేళ్ల ఫార్మసీ డిగ్రీ చదివిన యువత ఔషధ రంగంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జాతీయ ఔషధ మండలి అధ్యక్షుడు డాక్టర్‌ మోంతు ఎం.పటేల్‌ పిలుపునిచ్చారు.

Published : 04 Dec 2022 04:35 IST

జ్యోతి వెలిగిస్తున్న జాతీయ ఔషధ మండలి అధ్యక్షుడు మోంతు ఎం.పటేల్‌

తపోవనం (అనంతపురం గ్రామీణం), న్యూస్‌టుడే: నాలుగేళ్ల ఫార్మసీ డిగ్రీ చదివిన యువత ఔషధ రంగంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జాతీయ ఔషధ మండలి అధ్యక్షుడు డాక్టర్‌ మోంతు ఎం.పటేల్‌ పిలుపునిచ్చారు. అనంతపురంలోని రాఘవేంద్ర ఫార్మసీ కళాశాల (రైపర్‌)లో జరిగిన భారత ఫార్మసీ సంఘం విద్యార్థుల సదస్సుకు ముఖ్య అతిథి హాజరై ప్రసంగించారు. సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, ఫార్మసీ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోంతు ఎం.పటేల్‌ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం ఉద్యోగ అన్వేషణలే కాకుండా క్లినికల్‌ రీసర్చ్‌, పరిశ్రమల స్థాపనకు ఆలోచించాలని సూచించారు. జాతీయ ఫార్మసీ సంఘం అధ్యక్షుడు టి.వి.నారాయణ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ఔషధాల తయారీకి యువత శ్రీకారం చుట్టాలని కోరారు. జేఎన్‌టీయూ వీసీ రంగజనార్దన్‌, ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి, కామన్‌వెల్త్‌ ఔషధ సంఘం అధ్యక్షుడు ఆచార్య రావు వడ్లమూడి, కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ ప్రాంతీయ అధికారి రామ్‌కిశోర్‌, రైపర్‌ ప్రిన్సిపల్‌ వై.పద్మనాభరెడ్డి, ఉప ప్రిన్సిపల్‌ రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఔషధ రంగానికి సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని