logo

‘చేతనైతే జాకీ పరిశ్రమను తీసుకురండి’

మహిళా సొసైటీ అని చెప్పి రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి.. వాళ్ల వదినను ఛైర్‌పర్సన్‌గా పెట్టి మహిళల నుంచి సొమ్ము వసూలు చేశారని’ మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

Published : 04 Dec 2022 04:35 IST

మహిళల సమస్యలు వింటున్న మాజీ మంత్రి పరిటాల సునీత

అనంతపురం రాణినగర్‌, రాప్తాడు (ఆత్మకూరు), న్యూస్‌టుడే: ‘మహిళా సొసైటీ అని చెప్పి రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి.. వాళ్ల వదినను ఛైర్‌పర్సన్‌గా పెట్టి మహిళల నుంచి సొమ్ము వసూలు చేశారని’ మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం అనంతపురం గ్రామీణం ఆలమూరు గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేతనైతే ముఖ్యమంత్రికి చెప్పి జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకొని రావాలని డిమాండు చేశారు. ఒక్కో మహిళల నుంచి సొసైటీ పేరుతో రూ.10 వేలు వసూలు చేసి మొత్తం రూ.7 కోట్లు తీసుకొని మూడున్నరేళ్లయినా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నించారు. మహిళల సొమ్ముతో రియల్‌ ఎస్టేట్‌ చేయలేదా అని నిలదీశారు. ఆలమూరు కొండను లేఅవుట్‌ వేసి ఈగ్రామానికి చెందిన వారికి  ఇళ్ల పట్టాలు ఎందుకు ఇప్పించలేక పోయారని ప్రశ్నించారు. ఆలమూరు గ్రామ పంచాయతీలో 260 ఎకరాల పైగా భూములు ఉంటే బలవంతంగా తీసుకున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు రాప్తాడు మండలం గంగలకుంట గ్రామంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే పనులను చూసి ప్రజలు ఇదేం ఖర్మ మనకు అని విసుగు చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని