logo

స్థలం ఆక్రమణపై జనసేన ఆగ్రహం

గోరంట్ల పట్టణంలో రూ.కోట్ల విలువైన స్థలాన్ని అధికార పార్టీ నాయకులు ఆక్రమిస్తున్న విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో మండల జనసేన నాయకులు స్పందించారు.

Published : 07 Dec 2022 04:15 IST

ఆందోళనకారులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ రంగనాయకులు

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్ల పట్టణంలో రూ.కోట్ల విలువైన స్థలాన్ని అధికార పార్టీ నాయకులు ఆక్రమిస్తున్న విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో మండల జనసేన నాయకులు స్పందించారు. మంగళవారం ఉదయం వారు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆందోళన చేపట్టారు. ఓ స్థాయిలో తహసీల్దార్‌ రంగనాయకులపై మండిపడ్డారు. కార్యాలయానికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ దురాగతం మీ కంటికి కనిపించలేదా అని ప్రశ్నించారు. తహసీల్దార్‌ ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా వారు అసహనం వ్యక్తం చేశారు. కబ్జాకు పాల్పడిన వైకాపా నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వ స్థలానికి రక్షణ కల్పించాలని, అక్రమంగా వేసిన పునాదులను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. చివరగా ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై బాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి సురేష్‌, మండల కన్వీనర్‌ సంతోష్‌, నాయకులు శ్రీనివాసులు, అనిల్‌కుమార్‌, నాగేష్‌, తిరుపాల్‌, శ్రీకాంత్‌, బాబర్‌ తదితరులు పాల్గొన్నారు.

జేసీబీ ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు

ఆందోళన సందర్భంగా రెవెన్యూ సిబ్బంది పొక్లెయిన్‌ను పిలిపిస్తున్నట్లు నటించారు. అవి అందుబాటులో లేవన్న నెపంతో మిన్నకుండిపోయారు. పొక్లెయిన్‌లు అందుబాటులో లేవా..? లేదా భూ కబ్జాదారులకు భయపడి వాటిని ఏర్పాటు చేయలేకపోయారా అనే విమర్శలు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని