logo

జయహో బీసీ నినాదం కాపీ కొట్టిన వైకాపా

తెలుగుదేశం పార్టీ నినాదమైన జయహో బీసీని కాపీ కొట్టడాన్ని చూస్తే జగన్‌కు బీసీలపై ఉన్న కపట ప్రేమ తెలుస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

Published : 07 Dec 2022 04:15 IST

మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ నినాదమైన జయహో బీసీని కాపీ కొట్టడాన్ని చూస్తే జగన్‌కు బీసీలపై ఉన్న కపట ప్రేమ తెలుస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం అనంతపురంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైకాపా బీసీ సభను విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారంటే గోవుల మందకు తోడేలును కాపలా పెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బీసీల రాజ్యాధికారాన్ని నాశనం చేస్తున్న జగన్‌రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కుదించి బీసీలను దెబ్బతీశాడని విమర్శించారు. ఆఖరుకు జయహో బీసీ కార్యక్రమాన్ని సైతం పెత్తందారీ సామాజిక వర్గం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు సభలకు స్వచ్ఛందంగా తరలివస్తే బుధవారం జరిగే విజయవాడ సభకు బలవంతంగా తరలిస్తున్నారన్నారు. జగన్‌ ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఇప్పటికే బీసీలంతా ఏకమయ్యారని, తిరుగుబాటు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని