logo

లా కళాశాలలో ప్రవేశాల నిలిపివేత నిర్ణయంపై ఆగ్రహం

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని న్యాయశాస్త్రం కోర్సు ప్రవేశాలు నిలుపుదల చేయాలన్న అధికారుల నిర్ణయంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Published : 07 Dec 2022 04:15 IST

అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

ఎస్కేయూ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని న్యాయశాస్త్రం కోర్సు ప్రవేశాలు నిలుపుదల చేయాలన్న అధికారుల నిర్ణయంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఎస్కేయూ ముఖద్వారం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుళ్లాయిస్వామి, చిరంజీవి మాట్లాడుతూ బోధన ఉద్యోగుల కొరత కారణంగా లా విభాగం మూసివేస్తామని ఉన్నత విద్యామమండలికి లేఖ రాయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.
* ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు ప్రవేశాల రద్దును విరమించుకోవాలని ఏఐఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన డిమాండు చేశారు.
* కోర్సులను కొనసాగించాలని న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థులు డిమాండు చేశారు. మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ ప్రవేశాలు నిలుపుదల చేయాలన్న అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కి వినతి

ఎస్కేయూలో న్యాయశాస్త్రం కొనసాగించాలని ఏఐఎస్‌ఎఫ్‌ నేత అంకన్న, ఎస్‌ఎఫ్‌ఐ నేత వీరుయాదవ్‌ మంగళవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డిని కలసి వినతి పత్రం సమర్పించారు. కరవుప్రాంతమైన రాయలసీమలో ఏకైక ప్రభుత్వ న్యాయ కళాశాలను సైతం మూసివేయాలని లేఖ రాయడం దుర్మార్గమైన చర్య అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన పోస్టులు భర్తీ చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని