logo

నెలాఖరు వరకే హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు

హెచ్చెల్సీ పరిధిలోని ఆయకట్టు భూములకు డిసెంబరు ఆఖరువరకు మాత్రమే నీరు విడుదల చేస్తున్నట్లు ఈఈ వెంకటరమణారెడ్డి తెలిపారు.

Published : 08 Dec 2022 04:34 IST

బొమ్మనహాళ్‌, కణేకల్లు, న్యూస్‌టుడే: హెచ్చెల్సీ పరిధిలోని ఆయకట్టు భూములకు డిసెంబరు ఆఖరువరకు మాత్రమే నీరు విడుదల చేస్తున్నట్లు ఈఈ వెంకటరమణారెడ్డి తెలిపారు. బుధవారం కణేకల్లు హెచ్చెల్సీ సబ్‌-డివిజన్‌ పరదిలోని మూడో ప్యాకేజీలో అసంపూర్తిగా వదిలేసిన పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి ప్రొరేటా వాటా మేరకు 26.215 టీఎంసీలు కేటాయించారని, కేసీ కెనాల్‌ నుంచి రివర్స్‌ డైవర్షన్‌ కింద 2.606 టీఎంసీలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 20 టీఎంసీల మేర నీరు ఆంధ్రా సరిహద్దులకు చేరిందన్నారు. జిల్లాలో హెచ్చెల్సీ కింద లక్ష ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగు చేశారని చెప్పారు. వరి కోతకు రావడంతో ఆ పంటకు నీరు బంద్‌ చేయాలని రైతులే కోరుతున్నారన్నారు. మిగిలిన నీటిని నేరుగా ఎంపీఆర్‌, పీఏబీఆర్‌ జలాశయాల్లో నిల్వ ఉంచుతున్నట్లు తెలిపారు. హెచ్చెల్సీ ఎగువ కాలువ ఆధునికీకరణ పనుల్లో  అసంపూర్తిగా ఉన్నవాటికి రూ.600 కోట్లతో అంచనాలు ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఈఈ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు