logo

చిట్టీలు, అప్పుల పేరుతో కుచ్చుటోపీ

నల్లమాడ గ్రామానికి చెందిన వీరాంజనేయులు టీ స్టాల్‌ నడుపుతూ చిట్టీలు నిర్వహించేవాడు. అదేవిధంగా చిట్టీల మాటున ఒకరికి తెలియకుండా మరొకరితో అప్పులు కూడా చేశాడు.

Published : 09 Dec 2022 06:18 IST

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

నల్లమాడ, న్యూస్‌టుడే: నల్లమాడ గ్రామానికి చెందిన వీరాంజనేయులు టీ స్టాల్‌ నడుపుతూ చిట్టీలు నిర్వహించేవాడు. అదేవిధంగా చిట్టీల మాటున ఒకరికి తెలియకుండా మరొకరితో అప్పులు కూడా చేశాడు. అయితే చిట్టీదారులు, అప్పిచ్చినవారు డబ్బు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఈనెల 1న రాత్రికి రాత్రే ఉడాయించాడు. తాము కష్టపడి నెలనెలా పోగుచేసుకున్న సొమ్ము దాదాపు రూ.కోటిన్నర కాజేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. వారం రోజులైనా తిరిగా రాకపోవడం, కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేకపోవడంతో దాదాపు 100 మంది బాధితులు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ వలీబాషాకు ఫిర్యాదు చేశారు. దాదాపు 10 ఏళ్ల నుంచి నమ్మకంగా చిట్టీలు నడుపుతుండటంతో తామంతా రూ.లక్షల్లో ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడున్నా గాలించి సోమవారం లోపు గ్రామానికి పట్టుకొస్తామని పోలీసులు బాధితులకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని