logo

డీఎస్సీపై నీలినీడలు

ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిబంధనల మేరకు ఉపాధ్యాయ పోస్టులు 30 శాతం డీఎస్సీ ద్వారా, 70 శాతం పదోన్నతి ప్రకారం భర్తీ చేస్తారు.

Published : 21 Jan 2023 05:15 IST

ఖాళీ పోస్టులన్నీ పదోన్నతిపై భర్తీ

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిబంధనల మేరకు ఉపాధ్యాయ పోస్టులు 30 శాతం డీఎస్సీ ద్వారా, 70 శాతం పదోన్నతి ప్రకారం భర్తీ చేస్తారు. తాజాగా 30 శాతం పోస్టులను కూడా పదోన్నతి ప్రకారం భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సైన్స్‌సెంటర్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టుల్లోకి ఎస్జీటీలను సర్దుబాటు చేశారు. గురువారం 162 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించగా.. ఎక్కువశాతం మంది సమ్మతి ఇవ్వలేదు. తాజాగా శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. అవి సర్దుబాటు కాదని, పదోన్నతులు అని పేర్కొన్నారు. దీంతో శనివారం రెండోసారి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. పదోన్నతి సీనియార్టీ జాబితాలోని ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆదేశించారు. అసమ్మతి తెలిపిన వారికి ఏడాదిపాటు పదోన్నతి ఉండదని హెచ్చరించారు. సమ్మతి తెలిపిన వారికి తాత్కాలికంగా స్థానాలు కేటాయిస్తామని, సాధారణ బదిలీల తర్వాత శాశ్వత స్థానాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని