కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలకు సిద్ధం
జిల్లాలో ఆదివారం జరిగే కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరిగేలా సమష్టిగా చర్యలు తీసుకుందామని ఎస్పీ ఫక్కీరప్ప అధికారులకు సూచించారు.
అధికారుల సమావేశంలో మాట్లాడుతన్న ఎస్పీ ఫక్కీరప్ప
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: జిల్లాలో ఆదివారం జరిగే కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరిగేలా సమష్టిగా చర్యలు తీసుకుందామని ఎస్పీ ఫక్కీరప్ప అధికారులకు సూచించారు. శనివారం ఆయన తన ఛాంబర్లో నోడల్ అధికారులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. అనంతపురం, గుత్తి కేంద్రాలుగా మొత్తం 47 పరీక్ష కేంద్రాల్లో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన 24,055 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పారు. పరీక్ష సమయం కంటే గంట ముందు నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారన్నారు. అనంతపురం, గుత్తి కేంద్రాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో 10 ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, హనుమంతు, డీఎస్పీలు నరసింగప్ప, మహబూబ్బాషా, గంగయ్య, శ్రీనివాసులు, జేఎన్టీయూ ప్రిన్సిపల్ సుజాత, గుత్తి గేట్స్ కళాశాల ప్రిన్సిపల్ సిద్దేశ్వరరావు, ఎస్పీ సీసీ ఆంజనేయప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు
-
Sports News
Sunil Gavaskar: బ్రిస్బేన్ పిచ్ గురించి మాట్లాడరేం?
-
Politics News
Bhuma Akhila Priya: నంద్యాల ఎమ్మెల్యే ఇన్సైడర్ ట్రేడింగ్: భూమా అఖిలప్రియ