గొలుసు దొంగల అరెస్టు
తాడిపత్రి పట్టణంతోపాటు ఇతర ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.
స్వాధీనం చేసుకున్న బంగారు గొలుసులు,
నిందితులను చూపుతున్న జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, డీఎస్పీ, పోలీసులు
తాడిపత్రి, న్యూస్టుడే: తాడిపత్రి పట్టణంతోపాటు ఇతర ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్లో శనివారం ఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కంబదూరు మండలం వెంకటాంపల్లికి చెందిన ఎనుముల మారుతిప్రసాద్, రాంలానాయక్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ.6లక్షలు విలువ చేసే 11.2 తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిద్దరూ దొంగతనాలకు పాల్పడుతూ విలాసవంతంగా జీవించేవారు. గతంలో కళ్యాణదుర్గం, అనంతపురం, రాప్తాడు, బుక్కరాయసముద్రం మండలాల్లో చోరీలకు పాల్పడి రిమాండుకు వెళ్లి బెయిల్పై వచ్చారు. 2015 నుంచి ఇప్పటి వరకు ఇద్దరిపై 9 కేసులు నమోదైనట్లు ఎస్పీ వివరించారు. తాడిపత్రిలో గొలుసు దొంగతనాలకు పాల్పడే సమయంలో సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి, సీసీ కెమెరాలకు దొరకకుండా హెల్మెట్లు పెట్టుకునేవారని, తరచూ ద్విచక్ర వాహనాలు మారుస్తూ ఉండేవారని తెలిపారు. డీఎస్పీ చైతన్య, పట్టణ సీఐ ఆనందరావు, ఎస్సై ధరణిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. అందుకు శ్రమించిన పోలీసు సిబ్బంది రాజశేఖర్, చాంద్, మధు, కిశోర్, శ్రీనునాయక్, గోవింద్, రిజ్వాన్వలిని ఎస్పీ అభినందించారు. గ్రామీణ సీఐ చిన్నపెద్దయ్య, ఎస్సై గౌస్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!