logo

అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర

మాజీ మంత్రి తెదేపా నాయకుడు పరిటాల రవీంద్ర మృతిచెంది 18 ఏళ్లయినా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెదేపా రాష్ట్ర అధికారి ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు.

Published : 25 Jan 2023 04:26 IST

పరిటాల రవీంద్రకు పలువురి నివాళి

ఘాట్‌ వద్ద నివాళి అర్పిస్తున్న నందమూరి తారకరత్న, పరిటాల శ్రీరామ్‌ తదితరులు

రామగిరి, న్యూస్‌టుడే: మాజీ మంత్రి తెదేపా నాయకుడు పరిటాల రవీంద్ర మృతిచెంది 18 ఏళ్లయినా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెదేపా రాష్ట్ర అధికారి ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. రామగిరి మండలం వెంకటాపురంలో మంగళవారం దివంగత పరిటాల రవీంద్ర 18వ వర్ధంతిని నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పరిటాల అభిమానులు, తెదేపా శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి నివాళి అర్పించారు. పరిటాల శ్రీరామ్‌, తన సోదరుడు పరిటాల సిద్ధార్థ కుటుంబ సమేతంగా రవి ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించారు. పలువురు రాజకీయ నేతలు ఘాట్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. సినీనటుడు నందమూరి తారకరత్న, తెదేపా శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఈరన్న, కందికుంట వెంకటప్రసాద్‌, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ పూల నాగరాజు, సవితమ్మ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. రవి ఆశయాలను కొనసాగిస్తామని వివరించారు. తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అన్నదానం చేశారు.

హైదరాబాద్‌లోని తమ నివాసంలో రవి చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని