logo

అడ్డగోలు సర్దుబాటుపై పునః పరిశీలన

‘ఉపాధ్యాయుల సర్దుబాటులో అవకతవకలు’ శీర్షికన ఈనెల 25న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు.

Published : 26 Jan 2023 03:46 IST

పరిశీలిస్తున్న డిప్యూటీ డీఈవోలు

పద్మప్రియ, శంకరప్రసాద్‌, సిబ్బంది

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ‘ఉపాధ్యాయుల సర్దుబాటులో అవకతవకలు’ శీర్షికన ఈనెల 25న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. సర్దుబాటుపై వచ్చిన అభ్యంతరాలను పునః పరిశీలించారు. ఇన్‌ఛార్జి డీఈవో కృష్ణయ్య బుధవారం డిప్యూటీ డీఈవోలు పద్మప్రియ, శంకరప్రసాద్‌, రంగస్వామిలతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు సమర్పించిన ఫిర్యాదులు, ‘ఈనాడు’లో ప్రచురితమైన కేస్‌స్టడీస్‌లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన సర్దుబాటు చేసిన స్థానాలను, అందుకు కారణాలను సేకరించారు. ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టి తాజాగా ఉత్తర్వులు జారీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అడ్డగోలుగా జరిగిన స్థానాలను ఒకటి, రెండురోజుల్లో కొత్త ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని