logo

సైబర్‌ మోసాల కట్టడిపై అవగాహన

జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ కేసులు 116 వరకు నమోదయ్యాయని, జరిగిన మోసాలపై దృష్టి సారించి ఛేదించాలని సంబంధిత విభాగం అధికారులకు ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ సూచించారు.

Updated : 26 Jan 2023 06:45 IST

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే : జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ కేసులు 116 వరకు నమోదయ్యాయని, జరిగిన మోసాలపై దృష్టి సారించి ఛేదించాలని సంబంధిత విభాగం అధికారులకు ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ సూచించారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని ఆయా స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, సీఐలు, క్యాట్‌ టీమ్‌, ఎస్సైలు, సైబర్‌ క్రైమ్‌ సిబ్బంది, ఐటీ కోర్‌ సిబ్బందికి అనంతపురం జిల్లా పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజ్‌ ఆర్‌ఎస్‌ఐ వేణుగోపాల్‌ వీసీ ద్వారా సైబర్‌ నేరాల నియంత్రణ, ఫేక్‌ లోన్స్‌, ఆన్‌లైన్‌ మోసాలు, చిన్నారులపై అత్యాచారం, అపహరణ, ఆన్‌లైన్‌ వేధింపులపై అవగాహన కల్పించారు. వివిధ కేసుల్లో మోసపోయిన బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఎస్పీ సూచించారు. ఏఎస్పీ రామకృష్ణప్రసాద్‌ ఉన్నారు.

హోంగార్డుల సమస్యలకు పరిష్కారం

హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని సదరన్‌ రీజియన్‌ హోంగార్ట్‌ కమాండెంట్‌ మహేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం, పరేడ్‌ గ్రౌండ్‌లో హోంగార్డులకు ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. హోంగార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో పోలీసులకు హోంగార్డులు తక్కువేమీ కాదని, పోలీసు శాఖలో భాగమేనని, అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. దస్త్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు టైటాస్‌, శ్రీశైలంరెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని