logo

అన్ని రంగాల్లో రైల్వే డివిజన్‌ అగ్రస్థానం

భారత రైల్వేలో గుంతకల్లు రైల్వే డివిజన్‌ అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంటోందని డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి అన్నారు.

Published : 27 Jan 2023 04:33 IST

మాట్లాడుతున్న డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి

గుంతకల్లు, న్యూస్‌టుడే: భారత రైల్వేలో గుంతకల్లు రైల్వే డివిజన్‌ అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంటోందని డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి అన్నారు. రైల్వే క్రీడా మైదానంలో గురువారం గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. డీఆర్‌ఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రైల్వే రక్షణదళం, స్కౌట్‌ వాలంటీర్లు మార్చ్‌ఫాస్టు నిర్వహించి సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నెల నుంచి డిసెంబరు ఆఖరు వరకు రూ.1366 కోట్లు ఆర్జించిందని చెప్పారు. వీటిలో సరకుల రవాణా ద్వారా రూ.616 కోట్లు, ప్రయాణికుల ద్వారా రూ.650.9 కోట్లు, తుక్కు అమ్మకం ద్వారా రూ.38.66 కోట్లను గడించినట్లు చెప్పారు. పాలతో పాటు ఇతర రవాణా ద్వారా 50.44 కోట్లను ఆర్జించినట్లు వివరించారు.  ఇంధనం పొదుపులో గుంతకల్లు జంక్షన్‌, రైల్వే ఆసుపత్రికి జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నామని చెప్పారు. ఏడీఆర్‌ఎంలు సూర్యనారాయణ, మురళీకృష్ణ, సెక్యూరిటీ కమిషనర్‌ మురళీకృష్ణ, రైల్వే మహిళా సంక్షేమసంస్థ అధ్యక్షులు రూప, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని