logo

రైతులకిచ్చిన హామీల అమలుకు డిమాండు

దిల్లీ వద్ద రైతులు చేసిన ఉద్యమం సమయంలో అన్నదాతలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను విస్మరించారని అఖిలపక్ష రైతు సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య, అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, జిల్లా సీపీఐ కార్యదర్శి వేమయ్యయాదవ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ మండిపడ్డారు.

Published : 27 Jan 2023 04:33 IST

గణేశ్‌ కూడలిలో నిరసన తెలుపుతున్న రైతు సంఘాల నాయకులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే : దిల్లీ వద్ద రైతులు చేసిన ఉద్యమం సమయంలో అన్నదాతలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను విస్మరించారని అఖిలపక్ష రైతు సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య, అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, జిల్లా సీపీఐ కార్యదర్శి వేమయ్యయాదవ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ మండిపడ్డారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండు చేశారు. గురువారం స్థానిక మామిళ్లకుంటకూడలి నుంచి గణేశ్‌ కూడలి వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసగించిందని విమర్శించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలకు చట్టబద్దత లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో.. సాగు గుణనీయంగా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు నష్టాలతో అప్పులు ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు రుణమాఫీ చేస్తున్న మోదీ రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. జిల్లా అఖిలపక్ష రైతు సంఘం నాయకులు రమణ, నర్సాగౌడ, శ్రీరాములు, శంకరెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌ మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బయన్న, జనసేన నాయకులు తిరుపేంద్ర, సీపీఐ కార్యదర్శి వెంకటనారాయణ, లక్ష్మీనారాయణ, గౌస్‌లాజం, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని