logo

చీఫ్‌ హెడ్‌వార్డర్‌కు మరణానంతరం రాష్ట్రపతి అవార్డు

మండల పరిధిలోని ఖైౖదీల వ్యవసాయ క్షేత్రంలో చీఫ్‌ హెడ్‌వార్డర్‌గా పనిచేస్తూ మరణించిన అరుణ్‌కుమార్‌కు రాష్ట్రపతి అవార్డు వచ్చినట్లు కారాగార పర్యవేక్షకుడు చిన్నారావు చెప్పారు.

Published : 27 Jan 2023 04:33 IST

పోలీసు అధికారుల నుంచి రాష్ట్రపతి అవార్డు అందుకుంటున్న అరుణ్‌కుమార్‌ కుటుంబసభ్యులు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఖైౖదీల వ్యవసాయ క్షేత్రంలో చీఫ్‌ హెడ్‌వార్డర్‌గా పనిచేస్తూ మరణించిన అరుణ్‌కుమార్‌కు రాష్ట్రపతి అవార్డు వచ్చినట్లు కారాగార పర్యవేక్షకుడు చిన్నారావు చెప్పారు. 2021వ సంవత్సరంలో అరుణ్‌కుమార్‌కు అత్యుత్తమ పనితీరు కనపరచడంతో జైలు తరపున రాష్ట్రపతి అవార్డు కోసం ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. దురదృష్టవశాత్తూ ఆయన 2022 సంవత్సరంలో మరణించారన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి డీజీ కార్యాలయంలో అరుణ్‌కుమార్‌ భార్య సరస్వతి, కుటుంబ సభ్యులకు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రపతి అవార్డు అందించారని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు