అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య
ధర్మవరం మండలం ఓబుళనాయనిపల్లి తండాకు చెందిన శోభారాణి (36) అనే మహిళా రైతు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
ధర్మవరం, న్యూస్‌టుడే : ధర్మవరం మండలం ఓబుళనాయనిపల్లి తండాకు చెందిన శోభారాణి (36) అనే మహిళా రైతు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ధర్మవరం గ్రామీణ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. ఓబుళనాయనిపల్లి తండాకు చెందిన శోభారాణి కుటుంబానికి నాలుగున్నర ఎకరాల పొలం ఉంది. భర్త దూబేనాయక్‌తో కలసి ఆమె వ్యవసాయం చేసింది. కొన్నేళ్లుగా పంటలు చేతికందకపోవడం పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు రూ.10 లక్షల వరకు ఉన్నాయి. అప్పు కట్టాలని అప్పులు ఇచ్చిన వాళ్లు తరచూ అడుగుతుండటంతో అప్పుతీర్చేదెలా అని కొంతకాలంగా శోభారాణి మనోవేదనకు గురవుతుండేదని తండ్రి లక్ష్మీనాయక్ పేర్కొన్నారు. ఈ దశలో భర్త దూబేనాయక్ పొలం పనులకు వెళ్లగా ఇంటిలో పురుగులమందు తాగి శోభారాణి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి కుమారుడు ప్రణయ్‌నాయక్, కుమార్తె హేమశ్రీ ఉన్నారు. ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తండ్రి లక్ష్మీనాయక్ ఫిర్యాదు మేరకు ధర్మవరం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని