logo

ఇంటి పన్ను పేరిట పింఛన్‌లో కోత

పింఛన్‌ సొమ్ములో కోత విధించడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొమ్మనహాళ్‌ మండలం సిద్ధరాంపురం గ్రామంలో ఇంటి పన్నుకోసమని బుధవారం గ్రామ వాలంటీర్లు పింఛన్‌ లబ్ధిదారులు ఒక్కొక్కరి నుంచి రూ.250 కోత విధించి పంపిణీ చేశారు.

Published : 02 Feb 2023 05:24 IST

ఆందోళన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: పింఛన్‌ సొమ్ములో కోత విధించడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొమ్మనహాళ్‌ మండలం సిద్ధరాంపురం గ్రామంలో ఇంటి పన్నుకోసమని బుధవారం గ్రామ వాలంటీర్లు పింఛన్‌ లబ్ధిదారులు ఒక్కొక్కరి నుంచి రూ.250 కోత విధించి పంపిణీ చేశారు. రూ.2,500 మాత్రమే ఇవ్వడంపై వృద్ధులు, వితంతు, దివ్యాంగ పింఛన్‌దారులు వాలంటీర్లను నిలదీశారు. పంచాయతీ కార్యదర్శి ఇంటి పన్ను రూ.250 పట్టుకుని ఇవ్వమన్నారని దాటవేశారు. సుమారు 170 మంది నుంచి రూ.42,500 వరకు వసూలు చేశారని స్థానికులు తెలిపారు. ఆరు నెలల కిందట కూడా ఇంటి పన్ను పేరిట రూ.150 వసూలు చేసి ఇంత వరకు రసీదు కూడా ఇవ్వలేదని గ్రామస్థులు గంగాధర, ప్రభయ్య తెలిపారు. సొమ్ము వెనక్కి ఇప్పించాలని కోరారు. ఎంపీడీఓ షకీలాబేగం మాట్లాడుతూ అక్రమ వసూళ్లపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని