logo

వివేకా హత్య చర్చను మళ్లించేందుకే రాజధాని డ్రామా

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్న నేపథ్యంలో దాన్ని మళ్లించడానికి సీఎం జగన్‌ విశాఖను రాజధానిగా పాలన సాగిస్తామని కొత్త డ్రామాకు తెర లేపారని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుళ్లాయిస్వామి, చిరంజీవి విమర్శించారు.

Published : 02 Feb 2023 05:24 IST

నిరసన తెలుపుతున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

ఆజాద్‌నగర్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్న నేపథ్యంలో దాన్ని మళ్లించడానికి సీఎం జగన్‌ విశాఖను రాజధానిగా పాలన సాగిస్తామని కొత్త డ్రామాకు తెర లేపారని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుళ్లాయిస్వామి, చిరంజీవి విమర్శించారు. బుధవారం జడ్పీ ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు, విద్యార్థులు మోకాళ్లపై అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపారు. అమరావతినే రాజధానిగా ప్రకటించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని వారు డిమాండు చేశారు. కార్యక్రమంలో రమణయ్య, ఉమామహేష్‌, ఆనంద్‌, చిన్నా, నారాయణస్వామి, పవన్‌, హరి, మారుతి, విశ్వ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని